బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి

ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్‌ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది.

Published : 26 Apr 2024 08:16 IST

కడుపుబ్బి తీవ్ర అస్వస్థత
పోక్సో కేసు నమోదు

వెంకటాచలం, న్యూస్‌టుడే: ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్‌ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. పంపు కోసం సమీపంలోని గ్రామ సచివాలయం వద్ద వాలీబాల్‌ ఆడుకుంటున్న యువకుల వద్దకెళ్లారు. వారిలో ఒకడైన తొలికొండ రాజా.. బాలుడిని పట్టుకున్నాడు. అతని ప్రవర్తన చూసి మిగతా పిల్లలు అక్కడి నుంచి పరుగుతీశారు. తన చేతికి చిక్కిన బాలుడి మలద్వారంలో పంపు పెట్టిన రాజా.. బలవంతంగా గాలి కొట్టాడు. బాలుడి కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు వాచాయి. తొలుత ఇంట్లో చెప్పకుండా బాలుడు మిన్నకుండిపోయాడు. రాత్రివేళ నొప్పి తీవ్రమై విలవిల్లాడటంతో తల్లిదండ్రులు గమనించి నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని