AP News: చిన్ననాటి ప్రేమికుడితో.. భర్తను చంపించింది!

చిన్ననాటి ప్రియుడు ఆమెకు మళ్లీ కలిశాడు. అప్పటికే పెళ్లయినా... అతడితో సంబంధం కొనసాగించింది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి అతడిని చంపించింది. చివరకు పోలీసుల విచారణలో బయటపడింది. విశాఖపట్నం ప్రాంతంలో ఈ నెల 13న జరిగిన సతీష్‌(28)

Updated : 19 Jul 2021 09:37 IST

కొలిక్కి వచ్చిన మధురవాడ హత్య కేసు
భార్య, ఆమె ప్రియుడి అరెస్టు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: చిన్ననాటి ప్రియుడు ఆమెకు మళ్లీ కలిశాడు. అప్పటికే పెళ్లయినా... అతడితో సంబంధం కొనసాగించింది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి అతడిని చంపించింది. చివరకు పోలీసుల విచారణలో బయటపడింది. విశాఖపట్నం ప్రాంతంలో ఈ నెల 13న జరిగిన సతీష్‌(28) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలను డీసీపీ-1 గౌతమి, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రవికుమార్‌ ఆదివారం వెల్లడించారు. మధురవాడకు చెందిన రమ్యకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోనె సతీష్‌తో 2015లో పెళ్లయింది. తర్వాత ఇద్దరూ దుబాయ్‌ వెళ్లిపోయారు. 2017లో కుమార్తె పుట్టింది. 2019లో మళ్లీ గర్భవతి అయిన రమ్య ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. తన చిన్ననాటి ప్రేమికుడు షేక్‌ బాషా ఆలూరు ఆమెకు మళ్లీ కలిశాడు. అతడికీ పెళ్లయినా, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. నెల క్రితం దుబాయ్‌ నుంచి సతీష్‌ తిరిగి వచ్చాడు. తమ బంధానికి అతడు అడ్డమని భావించి.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఈ నెల 13న రాత్రి 8 గంటలకు రమ్య కొద్దిముందుగా వెళ్తుండగా.. సతీష్‌ తలపై బాషా ఇనుపరాడ్‌తో  కొట్టాడు. పథకంలో భాగంగా రమ్య పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా సతీష్‌ మరణించాడు. తన భర్తకు సుధాకర్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అతడు సతీష్‌ను బెదిరించేవాడని పోలీసులను తప్పుదోవ పట్టించింది. అయితే, భర్తను కొట్టేటప్పుడు ఆమె అడ్డుకోకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి.. బాషాను విచారించి నిజం రాబట్టారు. ఏలూరులో ఉన్న రమ్యను విశాఖ తీసుకొచ్చి విచారించారు. ఆ సమయంలో పలుమార్లు కళ్లు తిరిగినట్లు నటించిందని, ఏలూరులోనూ భర్తలేని జీవితం తనకొద్దంటూ చెయ్యి కోసుకుని అత్తవారిని నమ్మించే ప్రయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. బాషా, రమ్యలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని