పొట్టలో రూ.11 కోట్ల కొకైన్‌

రూ.11 కోట్ల విలువైన కొకైన్‌ క్యాప్సూళ్లు మింగి.. నీళ్లు తాగినా సరే అవి బయటికి పోతాయేమోనని 10 గంటలకుపైగా కడుపు బిగబట్టి విమానంలో ప్రయాణించిన ఓ నిందితుడిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కస్టమ్స్‌ అధికారుల వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో జొహన్నెస్‌బర్గ్‌ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి...

Published : 23 Aug 2021 03:48 IST

బెంగళూరు విమానాశ్రయంలో నిందితుడి పట్టివేత

బెంగళూరు, న్యూస్‌టుడే: రూ.11 కోట్ల విలువైన కొకైన్‌ క్యాప్సూళ్లు మింగి.. నీళ్లు తాగినా సరే అవి బయటికి పోతాయేమోనని 10 గంటలకుపైగా కడుపు బిగబట్టి విమానంలో ప్రయాణించిన ఓ నిందితుడిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కస్టమ్స్‌ అధికారుల వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో జొహన్నెస్‌బర్గ్‌ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. ప్రయాణ సమయంలో ఎయిర్‌ టికెట్‌ ప్యాకేజీలో భాగంగా అతడికి ఉచితంగా ఆహారం, నీరు, శీతల పానీయం ఇచ్చినా తీసుకోలేదు. పైగా ప్రయాణ సమయంలో మొత్తం అసహనంగా కనిపించాడు. ఈ విషయం గుర్తించిన విమానయాన సంస్థ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు తెలిపారు. దీంతో విమానాశ్రయంలో దిగగానే అతడిని సోదా చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతని కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు గమనించి స్కానింగ్‌ చేశారు. లోపల రూ.11 కోట్ల విలువైన 1.25 కిలోల క్యాప్సూళ్లు ఉన్నట్లు గుర్తించారు. విరేచనం ద్వారా బయటికి తీయించి కొకైన్‌గా తేల్చారు. నిందితుడు దక్షిణాఫ్రికాలోనే వాటిని మింగాడని అధికారులు శనివారం రాత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని