
కాణిపాకం ఆలయ పాత రథచక్రాలకు నిప్పు
కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం వినాయకస్వామి ఆలయ పాత రథచక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయాయి. స్వామివారి దివ్యరథం చక్రాలు పాడవడంతో పదేళ్ల కిందట వాటిని తొలగించి, కొత్తవి అమర్చారు. పాతచక్రాలను ఆలయ వెనుక భాగంలో వదిలేశారు. గురువారం కాలిన స్థితిలో గుర్తించిన అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఈవో కస్తూరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.