బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్టు

లైంగికంగా వేధించి, బాలిక ఆత్మహత్యకు కారకుడైన వినోద్‌ జైన్‌ను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం విజయవాడలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సునీల్‌కుమార్‌ ముందు హాజరుపరిచారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ

Published : 02 Feb 2022 05:17 IST

ఈనాడు, అమరావతి: లైంగికంగా వేధించి, బాలిక ఆత్మహత్యకు కారకుడైన వినోద్‌ జైన్‌ను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం విజయవాడలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సునీల్‌కుమార్‌ ముందు హాజరుపరిచారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను సీజ్‌ చేసి కోర్టుకు సమర్పించారు. ఐపీసీలోని 306, 354 (ఏ), (డి), 509, 506, పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి కోర్టు ఈనెల 15 వరకు రిమాండ్‌ విధించింది. అనంతరం జైన్‌ను మచిలీపట్నంలోని జిల్లా కారాగారానికి తరలించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి ఫోన్‌ను సైబర్‌ ఫోరెన్సిక్‌కు పంపించారు. బాలికకు సంబంధించిన మెసేజ్‌లు, వీడియోలు ఏమైనా ఉన్నాయా? అన్నది తేల్చనున్నారు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ను విచారించగా, బాలిక వచ్చీవెళ్లే సమయాల్లో వినోద్‌జైన్‌ అక్కడే ఉండేవాడని చెప్పాడు.

ఇష్టమైన దుస్తులతో మృత్యు ఒడిలోకి..

వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత.. ఆ బాలిక తనకు ఇష్టమైన దుస్తులు వేసుకుని అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లింది. వెళ్తూ.. తల్లిని ప్రేమపూర్వకంగా హత్తుకుంది. కరోనా సమయంలో పైకి ఎందుకు? అని తల్లి వారించినా వాకింగ్‌ చేసి వస్తానులే అని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత కొద్ది నిమిషాలకే పైనుంచి దూకేసిందని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని