శ్రీవారి అభిషేకం టికెట్లు ఇప్పిస్తానని మోసం

శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తానని చెప్పి తెలంగాణకు చెందిన భక్తులను చిత్తూరుకు చెందిన ఓ దళారి మోసగించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరుకు చెందిన శరవణ...

Updated : 24 May 2022 05:58 IST

రూ.4.5 లక్షలతో పరారైన దళారి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తానని చెప్పి తెలంగాణకు చెందిన భక్తులను చిత్తూరుకు చెందిన ఓ దళారి మోసగించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరుకు చెందిన శరవణ... నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మూడు కుటుంబాల భక్తులకు తొమ్మిది అభిషేకం టికెట్లు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ.4.5 లక్షలు గూగుల్‌పే ద్వారా వసూలు చేశాడు. భక్తులు టికెట్ల కోసం దళారీకి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. మోసపోయామని గ్రహించిన భక్తులు తితిదే విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించారు. వారి ద్వారా విజిలెన్స్‌ అధికారులు తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా... సోమవారం రాత్రి మూడు కేసులు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని