ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ దుర్మరణం

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం నందిగామలో ఒక ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ విద్యుత్తు స్తంభంపై తీగలు తగలడంతో మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలను ఎస్సై రాజారెడ్డి మంగళవారం వెల్లడించారు.

Published : 25 May 2022 04:23 IST

విద్యుత్తు స్తంభంపై అంటుకున్న మంటలు

నవీపేట, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం నందిగామలో ఒక ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ విద్యుత్తు స్తంభంపై తీగలు తగలడంతో మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలను ఎస్సై రాజారెడ్డి మంగళవారం వెల్లడించారు. గ్రామంలో కూలగొట్టిన ఒక పాత ఇంటి సర్వీసు తీగను తొలగించేందుకు ఎలక్ట్రీషియన్‌ బైరి మాధవరావు(45) కరెంటు స్తంభం పైకి ఎక్కారు. పైన ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలు ఆయనకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఒంటికి మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపు స్తంభంపైనే ఉండిపోయారు. స్థానికులు వెంటనే స్థానిక లైన్‌మేన్‌కు చెప్పి, విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. క్షతగాత్రుడిని కిందకు దించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, సోమవారం రాత్రి మృతి చెందారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మాధవరావుకు ముగ్గురు కుమారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు