రథానికి విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురి దుర్మరణం

రథాన్ని తిరిగి రథశాలకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో శనివారం జరిగింది. ఇటీవలశ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కేతెపల్లి గ్రామ శివారులోని రామాలయంలోని మూల విరాట్టును ఇనుప రథంలో

Published : 29 May 2022 05:16 IST

నల్గొండ జిల్లాలో విషాదం

నాంపల్లి, న్యూస్‌టుడే: రథాన్ని తిరిగి రథశాలకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో శనివారం జరిగింది. ఇటీవలశ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కేతెపల్లి గ్రామ శివారులోని రామాలయంలోని మూల విరాట్టును ఇనుప రథంలో ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. అప్పటి నుంచి రథం ఆరుబయటే ఉంది. దీంతో గ్రామానికి చెందిన ఆలయ దాత పస్నూరు దయానందరెడ్డి రథాన్ని రథశాలకు తరలించాలని గ్రామస్థులను పురమాయించారు. గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఆ ప్రయత్నాల్లో ఉండగా రథానికి 11 కేవీఏ విద్యుత్తు తీగలు తగిలి కరెంటు ప్రసరించింది. ఘటనలో రథం లాగుతున్న కేతెపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(38), పొగాకు మోహన్‌(40), గుర్రంపోడు మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(25) అక్కడికక్కడే మృతి చెందారు. కేతెపల్లికి చెందిన మరో వ్యక్తి రాజబోయిన వెంకటయ్యకు తీవ్ర గాయాలు కాగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని