Niranjan Reddy: మంత్రి నిరంజన్‌రెడ్డి పేరుతో వాట్సప్‌ చాటింగ్‌

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేరుతో ఓ సెల్‌ఫోన్‌ నంబరు ద్వారా గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్‌ చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. మంత్రి ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకుని

Updated : 14 Aug 2022 08:12 IST

సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి పీఆర్వో

వనపర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేరుతో ఓ సెల్‌ఫోన్‌ నంబరు ద్వారా గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్‌ చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. మంత్రి ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకుని వనపర్తి జిల్లాలోని అధికారులకు, నేతలకు హాయ్‌.. హౌఆర్‌యూ అంటూ ఓ నంబరు నుంచి సందేశం వచ్చింది. మీరెవరని ఎవరైనా చాట్‌ చేస్తే తాను నిరంజన్‌.. మంత్రినంటూ జవాబిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి పీఆర్వో శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మంత్రి పేరుతో చాటింగ్‌ చేస్తే స్పందించవద్దని కోరారు. ఈ విషయమై వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డి ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకుని ఓ నంబరు నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు మెసేజీలు వచ్చాయని, ఇది సైబర్‌ నేరగాళ్ల పనిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని