Amala paul: నటి అమలాపాల్‌ ఫిర్యాదుతో ఒకరి అరెస్టు

నటి అమలాపాల్‌ ఫిర్యాదుతో ఆమె స్నేహితుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. విళుపురం జిల్లా పోలీసులకు అమలాపాల్‌ ఓ ఫిర్యాదు చేశారు. అందులో... సినీ పరిశ్రమలోని

Updated : 31 Aug 2022 07:36 IST

చెన్నై, న్యూస్‌టుడే: నటి అమలాపాల్‌ ఫిర్యాదుతో ఆమె స్నేహితుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. విళుపురం జిల్లా పోలీసులకు అమలాపాల్‌ ఓ ఫిర్యాదు చేశారు. అందులో... సినీ పరిశ్రమలోని పరిచయం మేరకు భవ్‌నిందర్‌సింగ్‌ దత్‌ అలియాస్‌ భువి, ఆయన కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి తాను ఓ సినీ సంస్థను ప్రారంభించినట్టు తెలిపారు. దీనికోసం 2018లో విళుపురం జిల్లా పెరియముదలియార్‌ చావడిలో ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నామన్నారు. తర్వాత విభేదాలతో విడిపోయామని వెల్లడించారు. తాను సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని భవ్‌నిందర్‌సింగ్‌ దత్‌, అతని బంధువులు బెదిరించి డబ్బు, ఆస్తులను కాజేశారని పేర్కొన్నారు. 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు భవ్‌నిందర్‌ సింగ్‌ దత్‌ను మంగళవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని