మీసేవ నిర్వాహకులపై దాడి

భూ దస్త్రాలకు సంబంధించిన వివిధ పనులకు ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం ఇటిక్యాలలో కొందరు మీసేవ కేంద్రం,

Published : 24 Sep 2022 04:55 IST

ఎక్కువ రుసుం వసూలు చేస్తున్నారని ఆరోపణలు

సిద్దిపేట జిల్లా ఇటిక్యాలలో ఘటన

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: భూ దస్త్రాలకు సంబంధించిన వివిధ పనులకు ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం ఇటిక్యాలలో కొందరు మీసేవ కేంద్రం, నిర్వాహకులపై శుక్రవారం దాడి చేశారు. మీసేవలో అవకతవకలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన కొంతమంది తహసిల్దారు సహదేవ్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో ఆర్‌ఐ నాగరాజు శుక్రవారం ఇటిక్యాలకు వచ్చి మీసేవ కేంద్రంలో విచారణ చేపట్టారు. ఇదే సమయంలో అక్కడికి ఒక్కొక్కరుగా జనం పోగయ్యారు. వారు ఆర్‌ఐ, నిర్వాహకులతో అవకతవకల అంశం ప్రస్తావిస్తూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పి మూకుమ్మడిగా మీసేవ కేంద్రంలో కంప్యూటర్‌, సామగ్రిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిర్వాహకుడైన బైరి ఇస్తారిపై దాడి చేసి చితకబాదారు. ఆయన భార్యపైనా కొందరు మహిళలు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఆర్‌ఐ నాగరాజుకు పలువురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్రం నిర్వాహకుడు మాట్లాడుతూ.. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని