ప్రైవేటు ఆసుపత్రిలో విద్యుదాఘాతం

భద్రాచలంలోని ఖమ్మం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదం భయాందోళనలు కలిగించింది. మూడంతస్తుల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించారు.

Updated : 04 Oct 2022 04:22 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలంలోని ఖమ్మం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదం భయాందోళనలు కలిగించింది. మూడంతస్తుల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించారు. కింది భాగంలో స్కానింగ్‌ విభాగం ఉంది. సాయంత్రం 6.30 గంటలకు షార్ట్‌సర్క్యూట్‌ వల్ల స్కానింగ్‌ యంత్రాల్లో పొగలు, మంటలు వచ్చాయి. అక్కడి నుంచి పొగ అన్ని గదులకూ వ్యాపించడంతో ఊపిరాడక రోగులు, ఇతరులు ఆందోళన చెందారు. ఐసీయూ, సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో సుమారు 12 మందిని నిర్వాహకులు పట్టణంలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని