ఆకస్మిక వరదతో 8 మంది మృతి

దసరా రోజున పశ్చిమబెంగాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్పాయ్‌గుడిలోని మాల్‌ నదిలో బుధవారం రాత్రి దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి 8మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు వెల్లడించారు.

Published : 07 Oct 2022 05:08 IST

పశ్చిమబెంగాల్లోని జల్పాయ్‌గుడిలో విషాదం

జల్పాయ్‌గుడి: దసరా రోజున పశ్చిమబెంగాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్పాయ్‌గుడిలోని మాల్‌ నదిలో బుధవారం రాత్రి దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి 8మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు వెల్లడించారు. 100 మందిని రక్షించగలిగినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఆ సమయంలో 500 మంది వరకు ప్రజలు నది వద్ద ఉన్నట్లు చెప్పారు. బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లాలో దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో నీటిలో మునిగి ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో అయిదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని