అదర్‌ పూనావాలా ఫొటోతో మోసం.. రూ.కోటి కాజేసిన కేసులో ఏడుగురి అరెస్టు

మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పునావాలా ఫొటోతో మోసానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 Nov 2022 05:02 IST

పరారీలో ప్రధాన నిందితుడు

పుణె: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పునావాలా ఫొటోతో మోసానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పునావాలా ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకొని సీరమ్‌ సంస్థకు చెందిన ఓ డైరెక్టర్‌ సతీశ్‌ దేశ్‌పాండేతో నిందితుడు చాటింగ్‌ చేశాడని వారు తెలిపారు. డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టినట్లు పేర్కొన్నారు. అవి పునావాలా నుంచే వచ్చాయని నమ్మిన డైరెక్టర్‌ నిందితుడు వాట్సప్‌ చాటింగ్‌లో పేర్కొన్న ఎనిమిది బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.01 కోట్లను బదిలీ చేశారన్నారు. ఆ ఖాతాదారుల్లో ఏడుగురిని వేర్వేరు రాష్ట్రాల్లో అరెస్టు చేయగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ స్మార్థన పాటిల్‌ వెల్లడించారు. రూ.13 లక్షలు జప్తు చేశామన్నారు. నిందితులంతా బిహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని.. వీరంతా బీటెక్‌, బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ చదివారని డీసీపీ వివరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు