ప్రాణాలు తీసిన అప్పులు

పంటలు సరిగా పండక అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 09 Dec 2022 05:05 IST

ఇద్దరు రైతుల బలవన్మరణం

ముద్దనూరు, తాడిమర్రి, న్యూస్‌టుడే: పంటలు సరిగా పండక అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన రామిరెడ్డి (65) 5 ఎకరాలను కౌలుకు తీసుకుని వంకాయ, మిరప, చిక్కుడు పంటలను సాగు చేశారు. పెట్టుబడికి సుమారు రూ.15 లక్షల అప్పు అయింది. దిగుబడి సరిగా రాకపోడంతో మనస్తాపానికి గురయ్యేవారు. బుధవారం గ్రామ సమీపంలోని వంక దగ్గరలో పురుగుల మందు తాగి మృతి చెందారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి తూర్పు చెరువు కట్ట సమీపంలోని ఎస్సీ కాలనీకి చెందిన తగిలే భాస్కర్‌ (35)కు 5 ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా వేరుసెనగ సాగు చేస్తున్నారు. దిగుబడి రాక నష్టాలు వచ్చేవి. దీనికితోడు కుటుంబ పోషణకు రూ.రెండు లక్షలకు పైగా అప్పు తీసుకున్నారు. బ్యాంకులో వ్యవసాయ రుణం ఎక్కువ కావడంతో వడ్డీ కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని