Andhra News: బనియన్లలో బంగారు బిస్కెట్లు.. బస్సు సీట్ల కింద డబ్బు

కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద ఈ ఉదయం రూ.5కోట్లకు పైగా విలువైన సొత్తు పట్టుబడింది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేసిన ఎస్‌ఈబీ అధికారులు ఐదుగురు ప్రయాణికుల వద్ద పెద్ద మొత్తంలో

Updated : 06 Mar 2022 12:03 IST

కర్నూలు: కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద ఈ ఉదయం రూ.5కోట్లకు పైగా విలువైన సొత్తు పట్టుబడింది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేసిన ఎస్‌ఈబీ అధికారులు ఐదుగురు ప్రయాణికుల వద్ద పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 8.250కిలోల బంగారు బిస్కెట్లు, 28.5కిలోల వెండి, రూ.90లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న దేవరాజు, సెల్వరాజు, కుమారవేలు, మురుగేశన్‌, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూరు వెళ్తుండగా పట్టుకున్నారు.

బస్సులోని సీట్ల కింద డబ్బు.. ప్రత్యేకంగా తయారు చేయించిన బనియన్లలో బంగారు బిస్కెట్లను దాచి తరలించడానికి ఈ ఐదుగురు యత్నించినట్లు ఎస్‌ఈబీ అధికారులు వెల్లడించారు. సొత్తుకు సంబంధించిన జీఎస్టీ, ఈ-వే బిల్లులు, ట్రావెలింగ్‌ ఓచర్లు వీరి వద్ద లేవని చెప్పారు. అనంతరం వీరిని తాలుకా పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఈబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొత్తుకు సంబంధించిన యజమానులు సరైన ఆధారాలు తీసుకొస్తే.. దాన్ని అప్పగించడంతో పాటు ఐదుగురిని విడుదల చేసే అవకాశం ఉంది.

  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని