Hyderabad News: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌.. నలుగురు మైనర్లకు బెయిల్‌

జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు బెయిల్‌ మంజూరైంది. సైదాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌ నుంచి మంగళవారం..

Updated : 27 Jul 2022 10:47 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు బెయిల్‌ మంజూరైంది. జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ మంజూరు చేసింది. సైదాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌ నుంచి మంగళవారం ముగ్గురు బాలురు బెయిల్‌పై విడుదలయ్యారు. మరో బాలుడికి బెయిల్‌ మంజూరైనా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. నేడు హైకోర్టులో ఐదో బాలుడి బెయిల్ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

మే 28న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలిక(17)ను కొందరు మైనర్లు ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన విదితమే. నిందితులైన సాదుద్దీన్‌ మాలిక్‌(19)తోపాటు మరో అయిదుగురు బాలురను అరెస్ట్‌ చేశారు. వీరిలో సాదుద్దీన్‌ చంచల్‌గూడ జైలులో శిక్షను అనుభవిస్తుండగా మిగిలిన బాలురను జువైనల్‌ హోంకి తరలించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని