
Updated : 17 Jan 2022 06:16 IST
Crime News: పశువుల పండుగలో విషాదం: పొట్టేలును బలివ్వబోయి వ్యక్తి నరికివేత
చిత్తూరు: పశువుల పండుగలో విషాదం చోటుచేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పొట్టేలును బలిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో పొట్టెలును బదులు వ్యక్తి ప్రాణాన్ని తీశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని వలసపల్లెలో జరిగింది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలివ్వడానికి గ్రామస్థులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలును పట్టుకున్న సురేష్(35)ను నరికాడు. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :