Hyderabad: సినిఫక్కీలో కిడ్నాప్‌.. డబ్బులు దోచుకొని పరార్‌

ఓవర్‌సీస్‌ జాబ్‌ కన్సల్టెంట్‌ మురళీ కృష్ణను కొందరు దుండగులు కిడ్నాప్‌ (Kidnap) చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెబుతూ రూ.30 లక్షలు దోచుకున్నారు.

Updated : 05 Feb 2023 21:20 IST

హైదరాబాద్‌: భాగ్యనగరం (Hyderabad)లో ఓ వ్యక్తి కిడ్నాప్‌ (kidnap) కలకలం సృష్టించింది. ఓవర్‌సీస్‌ జాబ్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అమీర్‌పేటకు చెందిన మురళీ కృష్ణ.. గత నెల 27న లాల్‌బంగ్లా సమీపంలోని పాఠశాలలో పిల్లల్ని వదిలి వస్తుండగా కారుతో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి.. అతడిని కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం నగర శివారులోని బాటసింగారంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. రూ.60 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాలన్నారు. అందుకు మురళీకృష్ణ అంగీకరించకపోవడంతో చేయి చేసుకున్నారు. అతడి బావమరిదిని అరెస్టు చేశామని చెప్పి.. అతనితో ఫోన్లో మాట్లాడించారు. తన సోదరిని కూడా అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన మురళీ కృష్ణ.. తన భార్యకు జరిగింది చెప్పి.. రూ.30 లక్షలు సిద్ధం చేయించాడు. బావమరిదికి డబ్బులు ఇచ్చి.. నాంపల్లి వద్దకు నిందితుల్ని రప్పించారు. అక్కడ బ్యాగ్‌ తీసుకున్న తర్వాత.. నిందితులు మురళీకృష్ణను హయత్‌నగర్‌ వద్ద వదిలేశారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితుడు.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని