Army chopper crash: కూలిన సైనిక హెలికాప్టర్‌.. కో-పైలట్‌ మృతి

భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. అనారోగ్యంతో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిని తీసుకొచ్చేందుకు....

Published : 12 Mar 2022 01:36 IST

శ్రీనగర్‌: భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. అనారోగ్యంతో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిని తీసుకొచ్చేందుకు వెళ్తుండగా చీతా హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. నార్త్‌ కశ్మీర్‌లోని గురెజ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో కో-పైలట్‌ మృతిచెందగా.. పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పైలట్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇద్దరు పైలట్లూ ఆర్మీ ఏవియేషన్‌ కార్ప్స్‌కు చెందిన మేజర్‌ ర్యాంకు అధికారులేనని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని