Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు.
వేమూరు: ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. వేమూరు మండలం జంపని సమీపంలోని చివుకులవారి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం నూలుపూడి గ్రామానికి చెందిన 23 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి దీక్ష ముగించుకుని తిరిగి వస్తున్నారు. సోమవారం ఉదయం తెనాలిలో రైలు దిగి అక్కడి నుంచి టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో వాహన డ్రైవర్ నిద్రమత్తులో జంపని వద్ద రోడ్డు పక్కనే ఉన్న పోలీసు హెచ్చరిక బోర్డును ఢీకొట్టాడు. దీంతో వాహనం బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో బొలిశెట్టి పాండు రంగారావు, పాశం రమేశ్, బోదిన రమేశ్, బుద్దన పవన్‌కుమార్ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వేమూరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు