
Published : 24 Jan 2022 01:55 IST
Road Accident: టాటాఏస్-కారు ఢీ.. 20 మందికి గాయాలు
కరీంనగర్: జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్ వాహనం-కారు ఢీకొని 20 మంది గాయపడ్డారు. వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో టాటాఏస్ వాహనంలో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
Tags :