Crime News: రేవ్‌ పార్టీపై ఎన్సీబీ దాడి.. అదుపులో సూపర్‌స్టార్‌ తనయుడు.!

ముంబయి శివారులో జరిగిన ఓ రేవ్‌ పార్టీపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు దాడులు జరిపారు. తీరంలోని క్రూజ్‌ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారంటూ...

Updated : 03 Oct 2021 12:19 IST

ముంబయి: ముంబయి శివారులో జరిగిన ఓ రేవ్‌ పార్టీపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు దాడులు జరిపారు. తీరంలోని క్రూజ్‌ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారంటూ సమాచారం రావడంతో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎన్సీబీ అధికారులు అధిక మొత్తంలో కొకైన్‌, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. పలువురు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎన్సీబీ బృందం అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌కు చెందిన ఓ సూపర్‌స్టార్‌ తనయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం వారిని ముంబయికి తీసుకురానున్నారు. ఈ వార్తలతో బీటౌన్‌లో మరోసారి డ్రగ్స్ వాడకం చర్చనీయాంశంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని