Gang Rape: నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్‌.. ఆరుగురి అరెస్టు

నిజామాబాద్ నగరంలో యువతిపై అత్యాచార ఘటనను పోలీసులు చేధించారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో మరమ్మతుల్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి భవనంలో........

Updated : 01 Oct 2021 01:32 IST

నిజామాబాద్‌ క్రైం: నిజామాబాద్ నగరంలో యువతిపై అత్యాచార ఘటనను పోలీసులు చేధించారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో మరమ్మతుల్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి భవనంలో బుధవారం తెల్లవారు జామున యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. నగరానికి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో యువతి వెళ్లగా.. అతడితో పాటు మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తెలిపారు. ఇందుకు మరో ముగ్గురు సహకరించారన్నారు. ఈ దారుణ ఘటనపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుధవారం రాత్రి ఒంటిగంట తర్వాత డయల్‌ 100కి కాల్‌ వచ్చింది. ఘటనా స్థలిలో 18 ఏళ్ల యువతి ఉంది. రాత్రి మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించాం. కోలుకున్నాక సఖి కేంద్రానికి పంపాం. ఈ నెల 28న నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తిని యువతి కలిసింది. నిర్మాణంలో ఉన్న ఆసపత్రి వద్దకు వెళ్లారు. యువతిపై ముగ్గురు అత్యాచారం చేశారు. మరో ముగ్గురు సహకరించారు. నిన్న ఐదుగురిని, ఉదయం ఒకరిని అరెస్టు చేశాం. నిందితులను రిమాండ్‌కు తరలించాం’’ అని వివరించారు.

ఓ యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో బుధవారం కలకలం రేకెత్తించింది. బస్టాండ్‌ సమీపంలోని మూతపడిన ఓ ఆసుపత్రి భవనం వద్ద తెల్లవారుజామున ఆ యువతిని చూసిన కొందరు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని