Telangana News: బోధన్‌లో ఉద్రిక్తత... టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు

నిజామబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

Updated : 21 Mar 2022 04:08 IST

బోధన్‌: నిజామబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా... మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ వర్గం వారు పోలీసులపైకి రాళ్లు రువ్వటంతో లాఠీ ఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని నిజామాబాద్‌ సీపీ నాగరాజు తెలిపారు. పాలనాపరమైన అనుమతులు ఉంటేనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తాని సీపీ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని