TS: రెమ్‌డెసివిర్‌ విక్రయిస్తూ ఆస్పత్రి సిబ్బంది అరెస్టు

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ విక్రయిస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అధిక ధరకు రెమ్‌డెసివిర్‌ను విక్రయిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు ముగ్గరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు..

Published : 06 May 2021 01:20 IST

ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ విక్రయిస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అధిక ధరకు రెమ్‌డెసివిర్‌ను విక్రయిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు ముగ్గరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌ నర్సు, ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది కలిసి ఒక్కో ఇంజక్షన్‌ను రూ.38 వేలకు విక్రయించేందుకు ప్రయత్నించారు. నిందితుల నుంచి ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని