TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌.. పోలీసుల అదుపులో 13 మంది

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 

Updated : 12 Mar 2023 23:52 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌గా తేలింది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏగా ఏఎస్‌వో ప్రవీణ్‌ పనిచేస్తున్నారు. పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేపర్‌ లీకేజ్‌కు సంబంధించి ఓ మహిళ ద్వారా అభ్యర్థులతో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సదరు మహిళకు సహకరించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. దీనికి సంబంధించి పోలీసులు రేపు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు