Crime news: చిన్నారి హత్యాచార ఘటన.. ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్‌  

 ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ సిబ్బంది నిందితుడిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు. 

Updated : 15 Sep 2021 00:56 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హత్యచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడికి సంబంధించిన ఆనవాళ్లతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. నిందితుడి సమాచారం అందించినవారికి రూ. 10 లక్షలు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ సిబ్బంది నిందితుడిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు. నిందితుడు మద్యం మత్తులో బస్టాండ్లలో నిద్రపోయే అవకాశం ఉందని, సమాచారం తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం తెలియజేయాలని సజ్జనార్‌ తెలిపారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని