logo

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఉట్నూరులో తెరాస, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.

Published : 27 Nov 2022 03:43 IST

గుడిహత్నూర్‌లో రాజ్యాంగానికి పూలమాల వేస్తున్న దళిత సంఘం నాయకులు

ఉట్నూరు: రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఉట్నూరులో తెరాస, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. వైస్‌ఎంపీపీ దావులే బాలాజీ తెరాస నాయకులు ధరణి రాజేష్‌, సతీష్‌, ఎంఈవో శ్రీనివాస్‌, దళిత సంఘాల నాయకులు బిరుదల లాజర్‌, బండి విజయ్‌, సుభాష్‌, కొత్తపల్లి మహేందర్‌, ప్రజ్ఞాశీల్‌ పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: గుడిహత్నూర్‌లో బస్టాండ్‌ ఎదుట అంబేడ్కర్‌ విగ్రహానికి, రాజ్యాంగానికి పూలమాలలు వేశారు. అంబేడ్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు మాధవ్‌, సర్పంచి జాదవ్‌ సునీత, నాయకులు రమేష్‌, కిషన్‌ బుద్దె, అజయ్‌, కుశాల్‌, వినోద్‌, మాధవ్‌ ససానే, రాజేశ్వర్‌, అశోక్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

బేల: బేల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

ఉట్నూరు గ్రామీణం: నాగాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. సర్పంచి జాదవ్‌ సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.  
నేరడిగొండ: నేరడిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రిన్సిపల్‌ శబాన తరన్నమ్‌, అధ్యాకుడు బలరాం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
తలమడుగు : తలమడుగులో బ్లూ భీమ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచి కరుణాకర్‌రెడ్డి, యువజన సంఘం అధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించి.. బహుమతులను అందజేశారు. ఎంపీటీసీ సభ్యుడు సంటి, గంగన్న, యువజన సంఘ సభ్యులు చంద్రశేఖర్‌, ప్రసాద్‌, ఆశన్న, శేఖర్‌, రాములు, దిలీప్‌, అఖిల్‌, రాజు, బన్నీ పాల్గొన్నారు.
శాంతినగర్‌: పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌ రాజ్యాంగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెరాస, దళిత సంఘాల నాయకులు ఉన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి, జిల్లా మానవ హక్కుల సంఘం, వినియోగదారుల హక్కుల సమితి, మాల సంక్షేమ సంఘం నాయకులు రమేష్‌, మిలింద్‌, సంతోష్‌ కుమార్‌, శేఖర్‌, నారాయణ పాల్గొన్నారు.

ఇచ్చోడ, సిరికొండ, బజార్‌హత్నూర్‌: ఇచ్చోడ, సిరికొండ, బజార్‌హత్నూర్‌ మండలాల్లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
జైనథ్‌: జైనథ్‌తో పాటు గిమ్మ గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు కరాడి గంగన్న, దేవన్న, శేఖర్‌, రవి, భూమన్న, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎదులాపురం: కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానే మార్చటానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని టీఏవీఎస్‌ పిలుపునిచ్చింది. సంఘం ఆధ్వర్యంలో సుందరయ్యభవన్‌లో శనివారం అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉయిక విష్ణు, బైరి సోమేశ్‌, సంఘం ఉపాధ్యక్షుడు అర్జున్‌, సంతోష్‌, పాల్గొన్నారు.

ఇచ్చోడ: ఇచ్చోడలో శనివారం రాత్రి బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి జంగుబాపు, నాయకులు పోషట్టి, రాజు, నితిన్‌, మనోజ్‌కుమార్‌, మురళి ఉన్నారు.

బోథ్‌: బోథ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. బోథ్‌, సొనాలలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశికను చదివారు.  కాంగ్రెస్‌ నాయకులు గజేందర్‌, మండల అధ్యక్షుడు మహేందర్‌, అంబేడ్కర్‌ సంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి రమేష్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ అర్బన్‌: భారత రాజ్యాంగం దేశ సర్వోన్నత గ్రంథమని డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. మహాలక్ష్మివాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. నాయకులు నగేష్‌, భూపెల్లి శ్రీధర్‌, ఆనంద్‌రావు, మోతీరాం, ప్రధానోపాధ్యాయుడు గిరీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

తాంసి: తాంసి, కప్పర్ల, బండల్‌నాగపూర్‌, పొన్నారి, సావర్‌గామ్‌, ఘోట్కురి, గ్రామాల్లో నిర్వహించారు. కప్పర్లలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సదానందం, కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంతోష్‌, తెరాస అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి:  ఇంద్రవెల్లిలో జడ్పీటీసీ సభ్యురాలు పుష్పలత, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మారుతి డొంగ్రె పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు స్వర్ణలత, ఉప సర్పంచి గణేష్‌, కార్యదర్శి సంజీవ్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని