logo

వారంలో సమస్య పరిష్కరించకుంటే రైతులతో అష్టదిగ్బంధనం: భాజపా

ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 3 కిలోల తరుగు, హమాలీ, లారీ.. ఖర్చులంటూ క్వింటాలుకు 10-12 శాతం వరకు రైతుకు నష్టం కల్గిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Updated : 07 Jun 2023 03:26 IST

కలెక్టరేట్‌లో బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నాయకుల్ఠు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 3 కిలోల తరుగు, హమాలీ, లారీ.. ఖర్చులంటూ క్వింటాలుకు 10-12 శాతం వరకు రైతుకు నష్టం కల్గిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతూ భాజపా ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లి అక్కడ బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కుప్పలు తెప్పలుగా ధాన్యం పేరుకుపోతున్నా కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వముందని దుయ్యబట్టారు. జిల్లాలో కొనుగోళ్లను వేగవంతం చేస్తామని పాలనాధికారి హామీనిచ్చినా పరిస్థితిలో మార్పురాలేదన్నారు. రైతులను దోచుకుంటున్న సొమ్మంతా ప్రత్యేకంగా ఖాతాల్లో జమవుతున్నాయా అని ప్రశ్నించారు. స్థానిక మంత్రికి తెలియకుండా, ఆయన హస్తం లేకుండా ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుల కష్టం దోచుకుంటున్న నేతలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని, వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే రైతులతో అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పాలనాధికారి, అదనపు పాలనాధికారికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రావుల రాంనాథ్‌, మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, అంజుకుమార్‌రెడ్డి, డా.మల్లికార్జున్‌రెడ్డి, వొడిసెల అర్జున్‌, మ్యాక ప్రేమ్‌కుమార్‌, సరికెల గంగన్న, సాద సుదర్శన్‌, మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని