logo

13 ఆమోదం.. 10 తిరస్కరణ

ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్లో పరిశీలించారు.

Published : 27 Apr 2024 02:03 IST

నామపత్రాల పరిశీలన పూర్తి

నామపత్రాలను పరిశీలిస్తున్న సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్‌, జిల్లా రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్లో పరిశీలించారు. సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్‌, రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా సమక్షంలో వాటిని పరిశీలించగా.. అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు జరిగిన నామపత్రాల స్వీకరణలో 23 మంది అభ్యర్థులు 42 నామపత్రాలను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులో 13 మంది అభ్యర్థుల 27 నామపత్రాలను ఆమోదించిన అధికారులు, 10 మంది అభ్యర్థులు సమర్పించిన 15 నామపత్రాలు వివిధ కారణాలతో తిరస్కరించారు. అభ్యర్థులు ఒక్కొక్కరు నాలుగు నామపత్రాలను సమర్పించగా.. పరిశీలన అనంతరం వాటిని అభ్యర్థికి ఒకటి చొప్పున పరిగణనలోకి తీసుకుని బరిలో మిగిలిన, తిరస్కరణతో బరినుంచి తప్పుకున్న వారి జాబితాను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో బరిలో ఉండే వారి సంఖ్య ఈ నెల 29న తేలనుంది. కాగా తిరస్కరణకు గురైన వారిలో ప్రధాన పార్టీల తరఫున డమ్మీ అభ్యర్థులతో పాటు ఇతరులు ఉన్నారు.

ఆమోదం వీరికే..!:

నామపత్రాలు ఆమోదం పొందిన అభ్యర్థుల్లో ఆత్రం సుగుణ(కాంగ్రెస్‌), ఆత్రం సక్కు(భారాస), గోడం నగేష్‌(భాజపా), మాలోతు శ్యామ్‌లాల్‌ నాయక్‌(ఆదార్‌ పార్టీ), మేస్రం గంగాదేవి( ధర్మసమాజ్‌పార్టీ), గేడం సాగర్‌(ఇండియా ప్రజాబంధు పార్టీ), కొడప వామన్‌రావు (గొండ్వానా దండకారణ్య పార్టీ), నునావత్‌ తిరుపతి(విద్యార్థుల రాజకీయ పార్టీ), చవాన్‌ సుదర్శన్‌ (అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ), జంగు బాపు మేస్రం( బహుజన సమాజ్‌ పార్టీ), స్వతంత్రులు రాఠోడ్‌ సుభాష్‌, భుక్యా జైవంత్‌రావు, రాఠోడ్‌ రాజు

తిరస్కరణ..

నామపత్రాలు తిరస్కరణకు గురైన వారిలో రాఠోడ్‌ రమేష్‌ (భాజపా), దరావత్‌ నరేందర్‌(భారాస), ఆత్రం భాస్కర్‌(కాంగ్రెస్‌), మడావి వెంకట్రావు(రాష్ట్రీయ మానవ్‌ పార్టీ), స్వతంత్రులు చవాన్‌ రాము, నేతావత్‌ రాందాస్‌, కుమురం మంతయ్య, పెందూర్‌ సుధాకర్‌,  నైతం రవీందర్‌, ఆత్రం భీంరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని