logo

సెలవులొచ్చాయి.. యువ ఓటర్లు వస్తున్నారు

సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు.

Updated : 08 May 2024 06:58 IST

ఈ సారి వారి ఓట్లు ఎక్కువగా పోలయ్యే అవకాశం

మామడ, న్యూస్‌టుడే: సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు. ఈ ఎన్నికల్లో మాత్రం వాళ్ల ఓట్లు ఎక్కువగానే పోలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా అన్ని విద్యాసంస్థలు ఇప్పటికే వేసవి సెలవులు ప్రకటించాయి. ఎక్కడెక్కడో ఉండి చదువుకునే విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికలూ ఉండడంతో ఊళ్లోనే ఉండే యువతరానికి ఓటు వేసేందుకు మంచి అవకాశం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువతీ, యువకులు ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారు చాలానే కనిపిస్తున్నారు.

తొలిసారి ఓటు వేసే వారు అధికం..

  • బీటెక్‌, డిగ్రీ, ఇతర కోర్సుల నిమిత్తం పట్టణాలకు వెళ్లిన వారిలో చాలా మంది వేసవి సెలవులకు ఇంటికొస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో ఎక్కువ మంది పేర్లు తొలిసారి ఓటరు జాబితాలో కనిపిస్తున్నాయి. ఎలాగూ ఇంటి వద్దే ఉంటున్నాం.. తప్పకుండా ఓటేస్తామంటున్నారు.
  • హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్న రైనా ఫిర్దౌసి సెలవులు ఇవ్వడంతో సొంతూరు మామడకు చేరుకుంది.. ఈ సారి తప్పకుండా ఓటు వేస్తానని సంతోషంగా చెబుతోందామె.
  • చెన్నైలో బీటెక్‌ చదువుతున్న లక్ష్మణచాంద మండలం చింతల్‌చాందకు చెందిన సృశాంత్‌రెడ్డి సెలవులు ఇవ్వడంతో స్వగ్రామానికి వచ్చాడు..నిర్మల్‌లో మంగళవారం జరిగిన 5కే రన్‌లో పాల్గొన్నాడు. తొలిసారి ఓటు వేయనున్న ఆ యువ ఓటరును నిర్మల్‌ జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ అభినందించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు