logo

పోలింగ్ వేళ అప్రమత్తత అవసరం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు.

Updated : 10 May 2024 19:32 IST

ఎదులాపురం: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. జిల్లాలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు, సీఏపీఎఫ్ బలగాలతో శుక్రవారం సమావేశయ్యారు. పోలింగ్ సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనల పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత పోలీసులదేనన్నారు. పోలింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 రూట్లు, వాటిలో చేయాల్సిన విధుల గురించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ స్టేషన్ వద్ద వంద మీటర్ల పరిధిలో ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించొద్దాన్నారు. ఓటర్ స్లిప్పు, ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు