logo

అనుభవజ్ఞులే బోట్లు నడపాలి: ఎస్పీ

పోశమ్మగండి వద్ద పాపికొండల బోటు పాయింట్‌ను ఎస్పీ సతీష్‌కుమార్‌ సోమవారం తనిఖీ చేశారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి పాపికొండలకు వెళ్లే బోట్లను ఏ విధంగా ఆపరేట్‌ చేస్తున్నారో తెలుసుకున్నారు.

Published : 06 Dec 2022 01:34 IST

పూడిపల్లికి బోటుపై వెళ్లొస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్‌

దేవీపట్నం, న్యూస్‌టుడే: పోశమ్మగండి వద్ద పాపికొండల బోటు పాయింట్‌ను ఎస్పీ సతీష్‌కుమార్‌ సోమవారం తనిఖీ చేశారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి పాపికొండలకు వెళ్లే బోట్లను ఏ విధంగా ఆపరేట్‌ చేస్తున్నారో తెలుసుకున్నారు. పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు తొమ్మిది పడవలకు అనుమతులు ఉన్నాయని కంట్రోల్‌ రూమ్‌ అధికారులు ఆయనకు తెలిపారు. పోశమ్మగండి నుంచి పూడిపల్లి అవతల వరకూ గోదావరి గ్రాండ్‌-1పై ఎస్పీ పర్యటించారు. అనంతరం దస్త్రాలు తనిఖీచేశారు. ఆయన మాట్లాడుతూ అనుభవం ఉన్న సరంగులు (డ్రైవర్లు)తోనే బోట్లు నడపాలన్నారు. లైఫ్‌ జాకెట్లతోపాటు పర్యటకులు అన్ని జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ గండిపోశమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రంపచోడవరం సీఐ జి.సురేష్‌బాబు, ఎస్సై నాగార్జున, కంట్రోల్‌ రూమ్‌ సూపర్‌వైజర్‌ పి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని