logo

కెందుగుడలో బాల్య వివాహం అడ్డగింత

లక్ష్మీపురం పంచాయతీలోని కెందుగుడలో బాల్యవివాహాన్ని ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు.

Published : 05 Feb 2023 03:08 IST

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: లక్ష్మీపురం పంచాయతీలోని కెందుగుడలో బాల్యవివాహాన్ని ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలుడికి (15), సుత్తిగుడ గ్రామానికి చెందిన బాలికతో (17) వివాహం నిశ్చయించారు. అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకున్న సీడీపీఓ రాజేశ్వరి శుక్రవారం గ్రామాన్ని సందర్శించి వివాహాన్ని నిలుపుదల చేశారు. 18 ఏళ్లు నిండకుండా అమ్మాయిలకు, 21 ఏళ్లు నిండకుండా అబ్బాయిలకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. యుక్తవయస్సు వచ్చేవరకు వివాహం చేయబోమని ఇరుకుటుంబాలతో తీర్మానం చేయించాు. ఈ కార్యక్రమంలో పంచాయతీలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని