logo

రికార్డు స్థాయిలో వాల్తేర్‌ ఆదాయం

తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.9వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Published : 27 Mar 2023 04:38 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే : తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.9వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 5 రోజులు ఉండగానే రూ.9 వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8498.86 కోట్లు సాధించిందన్నారు. వాల్తేర్‌ బ్లూచిప్‌ విభాగంలో ఇది అత్యుత్తమ ఆదాయమన్నారు. 1 ఏప్రిల్‌ 2022 నుంచి 25 మార్చి 2023 వరకు రికార్డు స్థాయిలో 68.12 మిలియన్‌ టన్నుల సరకును లోడింగ్‌ చేశామన్నారు.  గతేడాది కంటే ఇది 1.24 మిలియన్‌ టన్నులు వృద్ధి సాధించినట్లన్నారు. లక్ష్య సాధనకు కృషి చేసిన వాల్తేర్‌ బృందాన్ని వాల్తేర్‌ డీఆర్‌ఎం అనూప్‌ శత్పథీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని