logo

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గిరిజనుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే ఆదేశించారు.

Published : 28 Mar 2023 05:07 IST

సమస్యలు వింటున్న పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజనుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఏపీవో శ్రీనివాసరావుతో కలిసి పీవో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో గిరిజన రైతులు రబ్బరు మొక్కలు నాటిన ప్రదేశంలో తుప్పలు తొలగించుకొనేందుకు, గోతులు తీసుకునేందుకు, కంచె ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కదల మొట్టిరెడ్డి, పల్లాల రామిరెడ్డి, కదల చెంబురెడ్డి తదితరులు స్పందనలో అర్జీ అందించారు. దేవీపట్నం మండలం శరభవరంలో తమ భూములకు వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేశామని, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కుంజం తాతాజిదొర, కొమరం నాగబాబుదొర అధికారులకు విన్నవించారు. అడ్డతీగల మండలం మట్లపాడు నుంచి బడదాం వరకు మెటల్‌రోడ్డు వేయాలని గిరిజనులు కోరారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జాన్‌రాజు, డి.ఎస్‌.శాస్త్రి, ఈఈలు డేవిడ్‌రాజు, నాగేశ్వరరావు, ఎండీ యూసఫ్‌, వెలుగు ఏపీడీ   శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్‌వో అనూష, ప్రాజెక్టు అగ్రికల్చర్‌ అధికారి రాంబాబు, జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ పార్వతీశ్వరరావు, డీఈలు సాయిసతీష్‌, దుర్గాప్రసాద్‌, రాజేంద్రబాబు, మత్స్య అభివృద్ధి అధికారి రమేష్‌, డివిజనల్‌ పౌరసరఫరాల   అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని