logo

జగన్‌ ప్రచార సభ వెలవెల

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ పేలవంగా సాగింది.

Published : 08 May 2024 01:37 IST

సీఎం ప్రసంగం సాగుతుండగానే వెళ్లిపోతున్న జనం

గాజువాక, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభ పేలవంగా సాగింది. అన్ని వార్డుల నుంచి ప్రజల్ని ఆటోల్లో తీసుకురావడానికి వార్డు కమిటీల కార్యకర్తలు ఆపసోపాలు పడ్డారు. కాలనీల్లో ఒక్కొక్కరికీ రూ.300 ఇచ్చి, ఆటోకు రూ.800 చొప్పున చెల్లించి జనసమీకరణ చేశారు. ఆటోలన్నీ మధ్యాహ్నం 3 గంటలకే లంకా మైదానంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ ప్రసంగిస్తున్న సమయంలోనే మహిళలు వెనుదిరిగి, గుంపులుగా ఆటోల వద్దకు చేరుకున్నారు. ఎవరూ వెళ్లొదని నాయకులు వారించినా వినలేదు.

ట్రాఫిక్‌ ఇక్కట్లు...

గాజువాక కూడలి మొత్తం పోలీసుల బందోబస్తుతో నిండిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో కూర్మన్నపాలెం, కొత్తగాజువాక వైపు వెళ్లాల్సిన వాహనదారులు దారీ తెన్ను లేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జాతీయ రహదారిపై షీలానగర్‌ నుంచి కూర్మన్నపాలెం వరకు వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు ఆటోనగర్‌ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాయి. వివిధ పరిశ్రమల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన కార్మికులు, దూర ప్రాంత ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం 3 గంటల నుంచే ప్రధాన రహదారుల్లో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు