logo

సర్కారు తీరుతో పింఛను కష్టాలు

ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈ నెల ఏడో తేదీ వరకు అందలేదు. దీంతో వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 08 May 2024 01:40 IST

20 కి.మీ.ల దూరం నుంచి ముంచంగిపుట్టు వచ్చిన వృద్ధ దంపతులు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈ నెల ఏడో తేదీ వరకు అందలేదు. దీంతో వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ బ్యాంకు ఖాతాలో పింఛను సొమ్ము జమ అయ్యిందో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. లక్ష్మీపురం పంచాయతీలోని కర్లాపొదోర్‌ గ్రామానికి చెందిన 80 ఏళ్లు పైబడిన వృద్ధుడు కొర్రా బొల్లి తన పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని మంగళవారం ముంచంగిపుట్టు వచ్చారు. కంటిచూపు సరిగాలేక వృద్ధురాలైన తన భార్య ముక్తను వెంటపెట్టుకుని మనుమడి సాయంతో రెండు బ్యాంకుల చుట్టూ తిరిగారు. 20 కి.మీ.ల దూరం నుంచి వచ్చి ఏ బ్యాంకులో నగదు జమ అయిందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ బ్యాంకు ఖాతాలో జమ చేశారనే సమాచారం ఇచ్చినా ప్రయోజనం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంటి చూపు కూడా సరిగ్గా లేని తనకు గ్రామంలో పింఛను ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, అధికారులు గ్రామ సచివాలయంలోనైనా అందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు