logo

నిత్యం నరకం.. ఒళ్లు హూనం..!

ఈ చిత్రాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి..  కంకిపాడు మండలం కుందేరు నుంచి ఇందుపల్లి వరకు సుమారు 12 కి.మీలు ఆర్‌ అండ్‌ బి రహదారిలో ప్రయాణమంటే  జనాలు వణికిపోతున్నారు.

Updated : 13 Aug 2022 06:37 IST


మారేడుపాక వెళ్లే మార్గంలో అడుగుకో గుంత

ఈ చిత్రాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి..  కంకిపాడు మండలం కుందేరు నుంచి ఇందుపల్లి వరకు సుమారు 12 కి.మీలు ఆర్‌ అండ్‌ బి రహదారిలో ప్రయాణమంటే  జనాలు వణికిపోతున్నారు. చాలా మంది వాహనచోదకులు మృత్యువాత పడిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం జులై 15వ తేదీలోగా రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని ప్రకటించింది. కానీ ఒక్క గుంత కూడా పూడ్చలేదు. కుందేరు, మానికొండ, తరిగొప్పల, మారేడుపాక, ఇందుపల్లి ఇలా 5 గ్రామాలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.


తరిగొప్పల సమీపంలో రాళ్లు లేచిపోయి రోడ్డు దుస్థితి

ఇందుపల్లి సమీపంలో భారీ గుంతలు

- మానికొండ(ఈనాడు, అమరావతి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని