logo

చెట్ల విక్రయంలో నిబంధనలకు నీళ్లు?

విస్సన్నపేటలో ఎన్నెస్పీ శాఖకు చెందిన వృక్షాల విక్రయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి.

Published : 05 Oct 2022 01:49 IST

గత ఏడాది నరికిన ఎన్నెస్పీ చెట్లు (పాత చిత్రం)

విస్సన్నపేట, న్యూస్‌టుడే: విస్సన్నపేటలో ఎన్నెస్పీ శాఖకు చెందిన వృక్షాల విక్రయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. నూజివీడు మెయిన్‌ బ్రాంచి ఎన్నెస్పీ కాలువపై చండ్రుపట్ల గ్రామం వద్ద గత ఏడాది సెప్టెంబరు 24వ తేదీన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రూ.లక్షల విలువైన జామాయిల్‌ చెట్లను యంత్రాలతో నరికి తరలించే యత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నెస్పీ అధికారులు, సిబ్బంది దాడి చేయడంతో వారంతా తప్పించుకోగా, నరికిన వాటిని నాడు అధికారులు స్వాధీనం చేసుకుని, సీజ్‌ చేశారు. అటవీ శాఖాధికారులతో వాటికి నెంబర్లు కేటాయించారు. కొద్దికాలం క్రితం తమ స్వాధీనంలో ఉన్న చెట్లను అధికారులు విక్రయించారు. నిబంధనల ప్రకారం, అటవీ శాఖ రూపొందించిన అంచనాలకు అదనంగా టెండర్లు ఆహ్వానించి, వీటిని అమ్మాల్సి ఉంది. ఈ విషయమై ఎన్నెస్పీ విస్సన్నపేట డీఈఈ సింహాద్రి అప్పన్నను విచారించగా, అటవీశాఖ నుంచి లిఖితపూర్వక అంచనాలు లేవని, మౌఖిక సూచనల మేరకు విక్రయాలు చేశామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని