logo

ఒకే ప్రాంత అభివృద్ధితో ప్రాంతీయ విద్వేషాలు : కొడాలి

ఒకే ప్రాంత అభివృద్ధితో ప్రాంతీయ విద్వేషాలు ఏర్పడతాయని.. హైదరాబాద్‌ విషయంలో అది రుజువైనందున ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.

Updated : 07 Oct 2022 05:10 IST

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న కొడాలి నాని దంపతులు

వేమవరం(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: ఒకే ప్రాంత అభివృద్ధితో ప్రాంతీయ విద్వేషాలు ఏర్పడతాయని.. హైదరాబాద్‌ విషయంలో అది రుజువైనందున ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. బుధవారం ఆయన సతీసమేతంగా వేమవరం కొండలమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర సంపద మొత్తాన్ని  హైదరాబాద్‌లోనే పెట్టి అభివృద్ధి చేయడంతో అక్కడివారు విభజన కోరుకున్నారని, మనమంతా ఆస్తులన్నీ వదిలేసి అనాథల్లా వచ్చేశామన్నారు. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల సమానాభివృద్ధికి మూడు రాజధానులు ఏర్పాటు చేయనుందన్నారు. కానీ కొందరు కేవలం తమ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని ఉద్యమాలు చేస్తున్నారని, వాటన్నింటిని దేవతలు, దేవుళ్లు గమనిస్తున్నారన్నారు. తొలుత సతీసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. వైకాపా నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని