logo

ఇళ్ల స్థలాల పేరిట పేదల్ని జగన్‌ మోసం చేస్తున్నారు: బాలకోటయ్య

అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్యను పోలీసులు వెంబడించి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక అటు విజయవాడ, ఇటు కంచికచర్ల పోలీసులు వెంబడించారు.

Updated : 26 May 2023 10:16 IST

కంచికచర్ల: అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్యను పోలీసులు వెంబడించి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక అటు విజయవాడ, ఇటు కంచికచర్ల పోలీసులు వెంబడించారు. రాజధానిలో సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలపాలని బహుజన ఐకాస పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బాలకోటయ్యను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్ని కట్టడి చేసి సభలు నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపానే అని మండి పడ్డారు. రాజధాని రైతుల్ని మోసం చేసినట్లే.. ఇళ్ల స్థలాల పేరిట పేదల్నీ ఆయన మోసం చేస్తున్నారని ఆరోపించారు.  అమరావతిలో ఆకు కదిలినా సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు