logo

పోలీసుల వైఖరిపై కొల్లు ఆగ్రహం

మచిలీపట్నంలోని ఇంగ్లీష్‌పాలెంకు చెందిన ముగ్గురు మైనార్టీ యువకులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్‌ చూపకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలవాలనుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఏడు గంటలపాటు గృహ నిర్బంధం చేశారు.

Published : 02 Jun 2023 04:14 IST

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: మచిలీపట్నంలోని ఇంగ్లీష్‌పాలెంకు చెందిన ముగ్గురు మైనార్టీ యువకులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్‌ చూపకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలవాలనుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఏడు గంటలపాటు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటిముందు పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిపై కొల్లు రవీంద్ర, తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురై విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నవారికి ఏదైనా జరిగితే అందుకు పోలీసులే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రవీంద్ర హెచ్చరించారు. పార్టీ నాయకులు బాబాప్రసాద్‌, ఖాజా, ఇలియాస్‌పాషా, పద్మజ, నీరజ, ఫణికుమార్‌ కార్పొరేటర్లు పోలీసుల తీరును ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని