logo

కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు

కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్‌ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..

Published : 28 Mar 2024 05:41 IST

ఈనాడు డిజిటల్‌ - అమరావతి: కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్‌ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై అవినీతి, ఆర్థిక సంబంధ నేరారోపణలు రుజువు కావడమే కారణం. ఆయన నుంచి అవినీతికి పాల్పడి స్వాహా చేసిన సొమ్ము రూ.1,30,85,068లను వసూలు చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇవీ... 2009లో కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం.. పలు అవినీతి అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. తర్వాత ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం సచివాలయంలో జడ్పీ సీఈవో స్థాయిలో ఉద్యోగంలో చేరారు. పూర్తి విచారణ జరిపిన ప్రభుత్వం.. ఆరోపణలు రుజువు కావడంతో సర్వీసు నుంచి తొలగించి నిధుల రికవరీకి ఆదేశించింది. ఈ తొలగింపు వెంటనే అమలులోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని