logo

దుమ్ము దుమారమే!

గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్మేసి, గాలి దుమారం చెలరేగి, రోడ్లను దుమ్ము ధూళి ముంచెత్తింది.

Published : 08 May 2024 04:21 IST

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, ఎ.కొండూరు, గంపలగూడెం: గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్మేసి, గాలి దుమారం చెలరేగి, రోడ్లను దుమ్ము ధూళి ముంచెత్తింది. ఎ.కొండూరు మండలంలోని జీళ్లకుంట తదితర గ్రామాల్లో వడగళ్లు కురిశాయి. బలమైన గాలుల కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు చిరుజల్లులు పడడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు