logo

అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పామర్రు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అన్నారు.

Published : 08 May 2024 04:37 IST

లంకపల్లి (పమిడిముక్కల), న్యూస్‌టుడే: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పామర్రు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అన్నారు. మంగళవారం మండలంలోని లంకపల్లి, శ్రీరంగపురం, కూడేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


కూచిపూడి, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం ఏన్డీయే కూటమితోనే సాధ్యమవుతుందని పామర్రు తెదేపా అభ్యర్థి వర్ల కుమార్‌రాజా సతీమణి విశ్రమ అన్నారు. మొవ్వ మండలం కూచిపూడిలో ఆమె మంగళవారం కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. భాజపా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పోలన అశోక్‌కుమార్‌, నాయకులు వీరంకి తులసిదాసు, వెంపటి గోపాలకృష్ణ, గుత్తికొండ పద్మ తదితరులు పాల్గొన్నారు. మొవ్వపాలెంలో కాట్రగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన, తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గూడపాడులో జనసేన నాయకురాలు కాకి ఝాన్సీ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. భట్లపెనుమర్రు, చినముత్తేవి, కోసూరు, అవురుపూడి, కాజ, పద్దారాయుడుతోట, పెడసనగల్లులోనూ స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


కపిలేశ్వరపురం(పమిడిముక్కల), న్యూస్‌టుడే: రాష్ట్రంలో చంద్రబాబు విజన్‌ ద్వారా స్వర్ణయుగం సాధ్యమని ప్రవాసాంధ్రుడు, పారిశ్రామికవేత్త తాతినేని రమేష్‌ అన్నారు. మంగళవారం కపిలేశ్వరపురంలో ప్రవాసాంధ్రులు తాతినేని విజయబాబు, వాసు, యుగంధర్‌, తెదేపా స్థానిక నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


కనుమూరు(పామర్రుగ్రామీణం): కనుమూరులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షం పడినా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అరుణ్‌శౌరి, కూటమి పామర్రు అభ్యర్థి వర్ల కుమార్‌రాజా సోదరుడు చైతన్య తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి గొడుగుల సాయంతో ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు