Published : 28 Nov 2021 03:10 IST
చిత్ర వార్తలు
ట్రాఫిక్ ఆగిందా.. ప్రాణం గోవిందా!
శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 మధ్యలో అరగంటసేపు గుంటూరు అరండల్‌పేట వంతెన పై నుంచి గ్రంథాలయం కూడలి వరకు రహదారికి ఇరువైపులా అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో ఆసుపత్రికి వచ్చే నాలుగు అంబులెన్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. వాటిని పక్కకు తప్పించడానికి వీలు లేని పరిస్థితి. నిత్యం ఇదే తంతు.
అమృతరావు దారి.. గోదారి
గుంటూరు నగరంలో శనివారం వర్షం లేదు... ఆ రహదారి మాత్రం చెరువులా మారింది ...అమృతరావు సెంటర్లో పైపులైను పగలడంతో నీరంతా రహదారి పైకి చేరి అరకిలోమీటరు మేర చేరింది. ఈ లీకేజితో నీటితో రహదారిపై వాహనదారులు అవస్థలు పడ్డారు. ఇక్కడ పైపులైనుకి శాశ్వతంగా మరమ్మతులు చేయకపోవడంతో ప్రతిసారి ఇదే పరిస్థితి, అమృతరావు సెంటర్లో పైపులీకేజి నుంచి వస్తున్న నీటితో రహదారి చెరువులా మారింది.
- ఈనాడు గుంటూరు
Tags :