logo
Published : 29/11/2021 05:31 IST

యువకుడిని రక్షించిన రైల్వే పోలీసులు


శివబ్రహ్మం

పెనమలూరు: తండ్రి చనిపోయాడనే మనోవేదనతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించిన కానూరుకు చెందిన యువకుడు శివబ్రహ్మంను రైల్వే పోలీసులు కాపాడారు. వారి కథనం ప్రకారం.. అతడు స్థానిక విద్యుత్తు సబ్‌ స్టేషన్‌లో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇటీవల తండ్రి మృతి చెందాడు. అప్పట్నించి మనోవేదనకు గురై శనివారం అర్ధరాత్రి తన బంధువులకు వీడియోకాల్‌ చేసి తాను విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటునాన్నంటూ తెలిపి పట్టాలపై పడుకున్నాడు. భయాందోళనలకు గురైన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు వెంటనే అతడి ఆచూకీ కనిపెట్టి కాపాడి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని