logo

‘బలవంతపు సంతకాల సేకరణ ఆపండి’

విద్యుత్తు శాఖ ఒప్పంద కార్మికులు నిరసనలు, ఆందోళనలు, పోరాటాల్లో పాల్గొనమంటూ సంతకాలు సేకరించే చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ

Published : 09 Dec 2021 04:05 IST

విద్యుత్తు శాఖ ఈఈ సంజీవరావుకు వినతిపత్రం ఇస్తున్న కనకలింగేశ్వరరావు, శ్రీనివాస్‌, రాజు, అనిల్‌కుమార్‌

సూర్యారావుపేట, న్యూస్‌టుడే :  విద్యుత్తు శాఖ ఒప్పంద కార్మికులు నిరసనలు, ఆందోళనలు, పోరాటాల్లో పాల్గొనమంటూ సంతకాలు సేకరించే చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. బుధవారం సూర్యారావుపేటలోని విద్యుత్తు సర్కిల్‌ కార్యాలయంలో ఈఈ (టెక్నికల్‌) సంజీవరావును కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి జి.కనకలింగేశ్వరరావు మాట్లాడుతూ.. ఒప్పంద కార్మికుల రెగ్యులరైజేషన్‌, సమాన పనికి సమాన వేతనం, పెయిడ్‌ హాలిడేస్‌, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించకుండా, కార్మికులను బెదిరించే చర్యలకు చేపట్టటం సమంజసం కాదన్నారు. హక్కులను సంరక్షించుకోవటం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌, యానియన్‌ నాయకులు లకనం రాజు, శ్రీరాం, అనిల్‌కుమార్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు